నయా మాల్.. నాచుతో.. నేచురల్‌గా!
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో.. ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే, ఇప్పుడున్న వాటిలో ఎక్కువశాతం ప్లాస్టిక్‌తో తయారైనవే! ఈ లోటును పూడ్చటానికి బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘బ్రివ్'.. సహజసిద్ధమైన ఫిల్టర్లతో ‘బ్రివ్ ప్రొ 2.0’ ఎయిర్ ప్యూరిఫయర్‌ను తయారుచేసింది.
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో.. ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే, ఇప్పుడున్న వాటిలో ఎక్కువశాతం ప్లాస్టిక్‌తో తయారైనవే! ఈ లోటును పూడ్చటానికి బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘బ్రివ్’.. సహజసిద్ధమైన ఫిల్టర్లతో ‘బ్రివ్ ప్రొ 2.0’ ఎయిర్ ప్యూరిఫయర్‌ను తయారుచేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకమైన ఏఐ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి రూపొందించిన ఈ ఎయిర్ ప్యూరిఫయర్.. ఇల్లు, ఆఫీస్ లాంటి ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని సృష్టిస్తుంది. గదుల్లో కాలుష్య కారకాలను తొలగిస్తుంది. ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఇందులోని అత్యాధునిక సెన్సార్లు.. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కేవలం 21 నిమిషాల్లో నాలుగు చదరపు మీటర్ల స్థలంలోని గాలిని శుభ్రం చేస్తాయి. ఇంట్లో కంపోస్ట్ చేయగల నాచు, కొబ్బరి పీచు ద్వారా ఈ యంత్రం గాలిని వడపోస్తుంది. ఏఐ సాంకేతికతతో వస్తున్న మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫయర్ ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో వస్తున్న ఈ ఎకోఫ్రెండ్లీ ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.37,300. briiv.co.uk ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

దుమ్ము.. దులిపేద్దాం..
పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో ఎదురయ్యే ప్రధాన సమస్య.. నిత్యం రాలిపోయే వాటి వెంట్రుకలు. చాలా మృదువుగా ఉండే పప్పీల వెంట్రుకలను తొలగించడం చాలా కష్టమైన పని. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఇంటిని కూడా శుభ్రం చేసుకునేలా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘డ్రీమ్ టెక్నాలజీస్’.. ‘ఆర్20’ పేరుతో కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించింది. ఇంటెలిజెంట్ డర్ట్ డిటెక్షన్ టెక్నాలజీ ద్వారా మనిషి కంటికి కనిపించని దుమ్ము, పెంపుడు జంతువుల సన్నని వెంట్రుకలనూ ఇది గుర్తిస్తుంది. ఇందులోని శక్తిమంతమైన 1,50,000 ఆర్పీఎం మోటార్.. క్లీనింగ్ పని ఈజీగా మార్చేస్తుంది. క్షణాల్లో దుమ్మూ – ధూళిని పట్టేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌తో రూపొందించిన మోటరైజ్డ్ మినీ-బ్రష్.. బట్టలు, ఫర్నిచర్ నుంచి జుట్టుతోపాటు చుండ్రును కూడా తొలగిస్తుంది. దీని హెడ్‌కు అమర్చిన ఎల్ఈడీ లైట్ల ద్వారా చీకటి ప్రదేశాల్లోని దుమ్మూ – ధూళిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఈ వాక్యూమ్ క్లీనర్.. ఇరుకైన ప్రాంతాల్లోని దుమ్మును కూడా బయటికి లాగేస్తుంది. అంతేకాదు.. ఇది బ్యాటరీతో నడిచే వాక్యూమ్ క్లీనర్. ఇందులో 8X2,900 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఏర్పాటుచేశారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేసుకుంటే.. 90 నిమిషాల వరకు నిరాంటకంగా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కేవలం 1.67 కిలోల బరువుండే ‘డ్రీమ్ ఆర్20’ ధర.. రూ.36,999. dreametech.comలో లభిస్తుంది.

పిల్లల కోసం.. పెన్సిల్ ల్యాంప్
వేసవి సెలవుల తర్వాత పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టాలంటే కష్టమే! అందుకే, వారి స్టడీ టేబుల్‌ను కాస్త వినూత్నంగా తీర్చిదిద్దితే సరి. భారత్‌కు చెందిన ప్రముఖ ఫర్నిచర్స్ ఉత్పత్తుల సంస్థ.. స్టూడియో మెటలర్జీ ఓ వినూత్నమైన టేబుల్ ల్యాంప్‌ను తీసుకొచ్చింది. పెన్సిల్ థీమ్‌తో రూపొందిన ఈ ల్యాంప్.. స్టడీ టేబుల్‌కు సరికొత్త అందాన్నిస్తుంది. పిల్లలు ఎక్కువ సమయం పుస్తకాలతో గడిపే అవకాశం కల్పిస్తుంది. ఈ పెన్సిల్ స్టాండ్‌ను పైన్ వుడ్‌తో తయారుచేశారు. చేతితో పెయింటింగ్ వేశారు. షాక్ సేఫ్ ప్రమాణాలు పాటించి.. ఈ స్టడీ ల్యాంప్ వైరింగ్ చేశారు. రెండు డెకరేటివ్ పెన్సిల్స్‌తో వస్తున్న ఈ ల్యాంప్ ఖరీదు రూ.12,000. studiometallurgy.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

కూల్ కూల్ చప్పల్స్!
వేసవిలో వేసుకోవడానికి స్లిప్పర్స్ ఎంతో అనువుగా ఉంటాయి. ఈ హాట్ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేయడానికి.. అమెరికాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ టోరీ బర్చ్ ఆధునిక స్లిప్పర్స్ డిజైన్ చేశారు. 100శాతం థర్మో ప్లాస్టిక్ పాలీయురథేన్ను వాడి.. ‘బబుల్ జెల్లీ ైస్లెడర్స్’ను తయారుచేశారు. ఈ చెప్పుల సోల్లో 100 శాతం రబ్బర్‌ను ఉపయోగించారు. ఈ సోల్లో ఉండే గాలి బుడగల వల్ల.. ఇవి జెల్లీని పోలినట్టు చాలా మృదువుగా, ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి వాటర్ ప్రూఫ్. వేసవిలో స్విమ్మింగ్ పూల్స్, బీచ్‌లలో తిరిగేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి. వియత్నాంలో తయారైన చెప్పులు.. ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఈ ఫ్లాట్ చెప్పుల ధర రూ.23,516. farfetch.com తోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో దొరుకుతాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

