Neel Mukthi | అమ్మకూ సెలవు.. బాధ్యతలను పక్కనపెట్టి మంచుతో ఆడుకుంటూ..
ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకూ సెలవులు, జీతాలు ఉంటాయి. ఆయా ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపూ ఉంటుంది. కానీ పెళ్లి అనే బంధంతో తన జీవితాన్ని భర్త, పిల్లలకు అంకితం చేసే మహిళకు మాత్రం ఏ గుర్తింపూ ఉండదు. అంతేకాదు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అలుపు లేకుండా ఆమె చేసే పని లెక్కలోకే రాదు.
Neel Mukthi | ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకూ సెలవులు, జీతాలు ఉంటాయి. ఆయా ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపూ ఉంటుంది. కానీ పెళ్లి అనే బంధంతో తన జీవితాన్ని భర్త, పిల్లలకు అంకితం చేసే మహిళకు మాత్రం ఏ గుర్తింపూ ఉండదు. అంతేకాదు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అలుపు లేకుండా ఆమె చేసే పని లెక్కలోకే రాదు. పిల్లల్ని కనడం, వారి చదువులు, ఉద్యోగాలు, బాగోగులు అన్నీ చూసుకునే అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేవాళ్లు ఎవరూ ఉండరు. అలాంటి ఓ అమ్మ తన అరవై ఏళ్ల జీవితంలో మొదటిసారి తన బాధ్యతలు వదిలేసింది. తనను తాను వెతుక్కుంటూ తనకు ఇష్టమైన ప్రాంతాల్లో విహరిస్తూ తన కలల్ని నిజం చేసుకుంటున్నది. తన తల్లి మొదటిసారి ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు నీల్ ముక్తీ.
హిమాచల్ ప్రదేశ్‌లోని కోక్సార్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏకంగా ఆరు దశాబ్దాల తరువాత సెలవు తీసుకుంది. బాధ్యతలను పక్కనపెట్టి మంచుతో ఆడుకుంటూ చిన్న పిల్లలా మారిపోయింది. ఆరుబయట మంచుముద్దలతో ఆడుకుంది. ఆమె ఫొటోలు, వీడియోను ఆమె కుమారుడు నీల్ ముక్తీ నెట్టింట పంచుకున్నాడు. ‘కొన్నేళ్ల తరువాత మా అమ్మ పని నుంచి బ్రేక్ తీసుకుంది. ఆమె ఎప్పుడూ మా నాన్న గురించి బాధపడుతుంది. నేను ఎంతో నచ్చచెబితే గానీ ఆమె ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నీల్. అతని అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా మరికొందరు మాత్రం అందరికీ అది వర్తించదని అనారోగ్యంతో ఉన్న తన తల్లికి తండ్రి గత 30 ఏళ్లుగా సేవలు చేస్తున్న విషయం పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

