HomeInternationalHeavy Rains Are Disrupting Peoples Lives In Rio Grande Do Sul State In Brazil
Brazil | బ్రెజిల్లో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న భారీ వర్షాలు.. వరదల ధాటికి 57 మంది మృతి
బ్రెజిల్‌లోని రియో గ్రాండే డూ సుల్ రాష్ట్రంలో భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
Brazil | సావో పౌలో: బ్రెజిల్‌లోని రియో గ్రాండే డూ సుల్ రాష్ట్రంలో భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. వరదల ధాటికి శనివారం మధ్యాహ్నానికి దాదాపు 57 మంది మరణించారు. అనేక మంది ప్రజల ఆచూకీ తెలియడం లేదు.
సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం 67 మంది అదృశ్యమైనట్లు తెలుస్తున్నది. ఈ రాష్ట్రంలోని 497 సిటీల్లో మూడింట రెండొంతుల నగరాలు వర్షాలకు ప్రభావితమవడంతో సుమారు 32,000 మంది నిరాశ్రయులయ్యారు. అనేక రోడ్లు, వంతెనలు ధ్వంసమవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.