Taapsee Pannu | కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేస్తూ యువతను ఉర్రూతలూగించిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం
డిఫరెంట్ రోల్స్‌తో దూసుకుపోతున్నది. బాలీవుడ్ బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. కొన్ని నెలల కిందట షారుఖ్ ఖాన్, తాప్సి నటించిన ‘డంకీ’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినా, ఆ సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘ఖేల్ ఖేల్ మే’.. సినిమాల్లో నటిస్తున్నది.
బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సి.. మంచి అవకాశాలు వస్తే దక్షిణాది చిత్రాల్లోనూ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏండ్లు దాటాయి. ప్రతి పాత్రనూ సవాలుగా తీసుకున్నాను. చాలెంజింగ్ క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నా. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇక్కడివరకు వచ్చాను. నా శ్రమకు తగిన ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. అందుకే నేను సాధించిన దానికి సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది తాప్సి.