ముంబై: భారత మహిళా రెజ్లింగ్‌కు ఆద్యురాలైన హమీదా బానుపై ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తమదైన రీతిలో ప్రత్యేక డూడుల్‌తో ముందుకొచ్చింది. ‘దేశ రెజ్లింగ్‌కు చుక్కానిలా నిలిచిన హమీదా బాను రెజ్లింగ్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించింది.
తన అసమాన నైపుణ్యంతో భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యర్థులను మట్టికరిపించడంలో ఆమెకు ఆమె సాటిగా నిలిచింది. భారత మహిళల రెజ్లింగ్‌లో బాను ట్రయల్‌బ్లేజర్‌గా నిలిచారు’ అని రాసుకొచ్చింది. 1940 దశకంలో 300కు పైగా బౌట్లలో హమీద విజయాలు సొంతం చేసుకుంది. పురుష రెజ్లర్లను ఓడించి తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది.