Redmi Note 13 Pro+ 5G | రెడ్మీ 13 ప్రో+ 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ లాంచింగ్.. ధరెంతో తెలుసా..?!
Redmi Note 13 Pro+ 5G | షియోమీ అనుబంధ రెడ్మీ తన మిడ్ రేంజ్ ఫోన్ రెడ్మీ నోట్ 13 ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Redmi Note 13 Pro+ 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ మిడ్ రేంజ్ ఫోన్ 13ప్రో+ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ (Redimi Note 13Pro+) ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సహకారంతో షియోమీ తన అనుబంధ సంస్థ రెడ్ మీ నోట్ 13 ప్రో+ 5జీ ఫోన్ను డెవలప్ చేసింది. బ్యాక్ ప్యానెల్పై బ్లూ, వైట్ స్ట్రైప్స్తోపాటు డ్యుయల్ టోన్ డిజైన్ కలిగి ఉంటుంది. ఏఎఫ్ఏ బ్రాండింగ్తోపాటు ఎక్స్ క్లూజివ్ బాక్స్, యాక్సెసరీస్ జత చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ రూ.34,999 పలుకుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు చెల్లింపులపై రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ తోపాటు లాంచింగ్ ఆఫర్ ధర ప్రకటించింది. వాస్తవంగా ఈ ఫోన్ ధర రూ.37,999. దీనికి తోడు రూ.3000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తున్నది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, షియోమీ రిటైల్ స్టోర్లు, ఎంఐ డాట్ కామ్ల్లో మే 15 నుంచి కొత్త ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999లకు లభిస్తుంది. ఫుషన్ బ్లాక్, ఫుషన్ పర్పుల్, ఫుషన్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
షియోమీ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సహకారంతో రెడ్మీ నోట్ 13ప్రో + 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫోన్ ఆవిష్కరించింది. రేర్ ప్యానెల్ పై ‘‘10’’ ఇంక్డ్ నంబర్ ముద్రిస్తారు. సాకర్ ఫుట్ బాల్ దిగ్గజం లియానెల్ మెస్సీ ఐకానిక్ జెర్సీ నంబర్ కూడా 10 కావడం ఆసక్తి కర పరిణామం.
రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ ఫోన్లో మాదిరిగానే రెడ్మీ నోట్ 13ప్రో+ 5జీ వరల్డ్ చాంపియన్స్ ఎడిషన్ ఫీచర్లు ఉంటాయి. 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ విత్ 1.5కే రిజొల్యూషన్ (1220×2712 పిక్సెల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 200-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ లభిస్తుంది. 120వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

