కనక్టికట్: అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హైవేపై ఇంధన ట్యాంకర్(Fuel Tanker Blast) పేలింది. నార్వాక్‌లోని ఇంటర్‌స్టేట్-95లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఓవర్‌పాస్ వద్ద వాహనం ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం వల్ల న్యూ ఇండ్లండ్, నూయార్క్ మద్య ఉన్న రవాణా రోడ్డును మూసివేసినట్లు కనక్టికల్ గవర్నర్ నెడ్ లామోంట్ ప్రకటించారు. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ కారు అకస్మాత్తుగా లేన్లు మారడం.. మరో ట్రేలర్ ట్రక్కు.. ఇంధన ట్యాంకర్.. ఫెయిర్‌ఫీల్డ్ అవెన్యూ వద్ద ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన ఐ-95 రోడ్డుపై ప్రతి రోజు సుమారు లక్షా 60 వేల వాహనాలు తిరుగుతాయని గవర్నర్ లామంట్ తెలిపారు. ప్రమాదం తీవ్రంగా ఉన్న కారణంగా… స్థానిక మార్కెట్లకు అందాల్సిన సరుకు రవాణా ఆలస్యం అవుతోందని, దాని వల్ల సప్లయ్ చెయిన్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.
Two trucks caught fire on I 95 heading south through Norwalk Connecticut early this morning. I hope no one lost their lives, but that is very questionable. This stretch of highway is known to be one of the most dangerous stretches through the northeast. pic.twitter.com/vu9UyMdMY4
— Lou DiMeglio (@DiMeglioLou) May 2, 2024