Ayalaan | కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఆర్ రవికుమార్ డైరెక్షన్లో నటించిన చిత్రం అయలాన్ (Ayalaan). రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ తమిళనాడులో పొంగళ్ కానుకగా 2024 జనవరి 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఆ వెంటనే అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డది.
థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫైనల్‌గా ఓటీటీలో అందుబాటులో వచ్చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత అయలాన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. సుమారు ఏడాది తర్వాత అయలాన్ డబ్బింగ్ వెర్షన్ పాపులర్ ఓటీటీ ప్టాట్ఫాం ఆహాలో సందడి చేయనుంది. జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అయలాన్. కాగా అయలాన్ ఇటీవలే జీ తెలుగులో టీవీ ప్రీమియర్ అయింది. మరి ఇన్నాళ్ల తర్వాత వస్తున్న అయలాన్ ఓటీటీలో ఎలాంటి రియాక్షన్ రాబట్టుకుంటునేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
అయలాన్ సినిమాకు సీక్వెల్ అయలాన్ 2 కూడా రెడీ అవుతున్నట్టు కేజేఆర్ స్టూడియోస్, ఫాంటోమ్ఎఫ్ ఎక్స్ స్టూడియో ఇప్పటికే సంయుక్తంగా ప్రకటన కూడా చేశాయి. ఈ సారి ప్రత్యేకించి వీఎఫ్ఎక్స్, సీజీఐ పనుల కోసమే రూ.50 కోట్లు ఖర్చుపెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
#Ayalaan (Telugu Version) streaming from January 7 on AhaVideo 🍿!!#OTT_Trackers pic.twitter.com/5UHRXa0nqB
— OTT Trackers (@OTT_Trackers) January 6, 2026
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?