రాజాపేట, ఫిబ్రవరి 13 : మున్సిపల్ ఎన్నికల్లో రాజాపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. మండల కేంద్రమైన రాజాపేటకు చెందిన పొన్నం మార్కండేయ చిన్న కూతురు ఏలే భువనేశ్వరి శివ భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి అర్బన్ 1వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించింది. అదేవిధంగా మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన ఆరే బాలస్వామి కూతురు గుడికంటి వెన్నెల రాము బీఆర్ఎస్ పార్టీ నుండి జనగామ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డులో విజయఢంకా మోగించింది.
మండలంలోని పుట్టెగూడెం గ్రామానికి చెందిన ఆడపడుచు బిట్టు సరోజ హరీష్ యాదగిరిగుట్ట 5వ వార్డు కౌన్సిలర్‌గా, మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన యమ్మ బీరప్ప కూతురు బీజన బాలమణి భాస్కర్ ఆలేరు 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా కాంగ్రెస్ నుండి గెలుపొందారు. రాజాపేట మండలం నుంచి నలుగురు ఆడపడుచులు కౌన్సిలర్‌గా ఎంపిక కావడంతో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఎర్రగోగుల జస్వంత్, బీఆర్ఎస్ మండల నాయకుడు, కోఆపరేటివ్ డైరెక్టర్ జన్నెపల్లి ప్రభాకర్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులుతో పాటు ఆయా గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

మున్సిపల్ కౌన్సిలర్లుగా రాజాపేట ఆడపడుచులు