RS Praveen Kumar | ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు టోల్ ఫీ నెంబర్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar | హైవేల మీద వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసినట్లుగానే ప్రభుత్వం 1800 599 4788 టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టి కమీషన్లు దండుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. 22ఏ కింద బ్లాక్ లిస్టులో పెట్టిన ఆస్తులకు సంబంధించి సర్కారు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టింది.
RS Praveen Kumar : హైవేల మీద వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసినట్లుగానే ప్రభుత్వం 1800 599 4788 టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టి కమీషన్లు దండుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. 22ఏ కింద బ్లాక్ లిస్టులో పెట్టిన ఆస్తులకు సంబంధించి సర్కారు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. కస్టార్జితమైన ఆస్తులు కూడా కొన్ని పొరపాటున బ్లాక్ లిస్టులో ఉన్నాయని, టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే వాటిని బ్లాక్ లిస్టు నుంచి తీసేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయగానే మాకు 30% ఇస్తే తీసేస్తామని డీల్ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికే ఈ నెంబర్ పెట్టారని ఆరోపించారు. 22-A తీసుకొచ్చి ఆస్తులను, ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టింది మీరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లను కూడా 22-A లోకి తీసుకొచ్చారని అన్నారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ఇంతకుముందు కలెక్టర్లకు, ఎమ్మార్వోలకు తెలియకుండా పొంగులేటి భూభారతిలో 22 వేల ట్రాన్సాక్షన్స్ చేశాడన్నారు. అయితే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

