జనగామ : జనగామలో కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరాచకాలకు అడ్డులేకుండా పోతున్నది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో దౌర్యన్యాలకు పాల్పడింది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు ప్రయత్నించడం కలకలం రేపింది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి భూష పర్వతాలు
బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో పర్వతాలు అనే అభ్యర్థిని క్యాంపుకు తరలిస్తుండగా భువనగిరి వద్ద అడ్డుకుని, అతన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.