హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో సంకటహర చతుర్థి (Sankatahara Chaturthi) సందర్భంగా కాకతీయుల కాలం నాటి ఉత్తిష్ఠ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాభిషేకం, నారికేల జలాభిషేకం,కుంకుమ హరిద్రా లేపన అభిషేకం నిర్వహించి భక్తుల గ్రహబాధలు తొలగిపోవాలని జిల్లేడు దండలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వహించారు.
నివేదన, నిరాజన మంత్రపుష్పముల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ‘ఓం గం గణపతయే’అంటూ భక్తులందరూ నామస్మరణ చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్, వైదిక బృందం గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, ప్రణవ్, కాశీవిశ్వనాథచారి అభిషేకం నిర్వహించారు.