Pothole | ప్రాణం పోసిన రోడ్డు గుంత.. బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ బతికింది!
Pothole | గుంతలు ప్రాణాలు తీయడమే కాదు.. పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుందని ఈ ఘటన చూస్తే ఎవరికైనా అన్పిస్తుంది. యూపీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళను అంబులెన్స్‌లో తీసుకువస్తుండగా ఆ వాహనం గుంతలో పడటంతో ఆమె ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.
Pothole | లక్నో: గుంతలు ప్రాణాలు తీయడమే కాదు.. పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుందని ఈ ఘటన చూస్తే ఎవరికైనా అన్పిస్తుంది. యూపీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళను అంబులెన్స్‌లో తీసుకువస్తుండగా ఆ వాహనం గుంతలో పడటంతో ఆమె ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.
వివరాల్లోకి వెళితే.. పిలిభిత్ జిల్లాలోని కోర్టులో వినీతా శుక్లా అనే మహిళ కాపీయిస్టుగా పనిచేస్తున్నది. అయితే సుమారు 15 రోజుల క్రితం ఆమె పాముకాటుకు గురవ్వడంతో ఆమె భర్త కులదీప్ శుక్లా ఆమెను తొలుత ప్రభుత్వ దవాఖానకు, తర్వాత బరేలిలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. డాక్టర్లు ఆమెకు చికిత్స చేసినప్పటికీ లాభం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించి ఇంటికి తీసుకుపోవాలని చెప్పారు. దీంతో పిలిభిత్‌లోని కుటుంబ సభ్యులకు కులదీప్ సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వినీత మృతదేహంతో కుల్దీప్ అంబులెన్స్‌లో ఊరికి బయలుదేరాడు.
దారిలో బరేలీలోని హఫీజ్‌గంజ్ వద్ద వారి అంబులెన్స్ చక్రం పెద్ద గోతులో పడటంతో వాహనం పెద్ద కుదుపునకు గురైంది. తర్వాత సర్దుకుని చూడగా, వినీత శరీరంలో కదలికలు గమనించారు. దీంతో వారు అంబులెన్స్‌ను తిరిగి దవాఖానకు తీసుకువచ్చారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. 13 రోజుల తర్వాత ఆమె ఇప్పుడు చలాకీగా కొడుకు, కోడలు, కుమార్తెతో ఆనందంగా ముచ్చట్లు పెడుతూ కన్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

