పురాణాల్లో మార్కండేయుడి పాత్ర చిత్రం. వరపుత్రుడే అయినా.. అల్పాయుష్కుడు. కఠోర తపస్సు చేసి, శివుణ్ని మెప్పించి.. చిరంజీవిగా నిలిచాడు. మానవ మాత్రుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగిన ఆ ప్రాతఃస్మరణీయుడి పేరిట వెలిసిందే ‘మార్కండేయ పురాణం’. అష్టాదశ పురాణాల్లో ప్రధానమైన వాటిలో ఇదీ ఒకటి. ఇందులో వివిధ ఆయుర్వేద మూలికల ప్రస్తావనలు ఉన్నాయి. అమ్మవారి తొమ్మిది రూపాలకు అనుబంధంగా ఉండటం ఈ మూలికల ప్రత్యేకత. అనారోగ్యాన్ని తుంచి, ఆయుష్షును పెంచే మూలికలల వివరాలు ఇవి…
దీన్ని హరీతకి అని పిలుస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల్లో ఒకటైన శైలపుత్రికి అనుబంధంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే హరీతకి మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు కూడా అధికం. దీంతో వివిధ పొట్ట సంబంధ సమస్యలు, అల్సర్ల చికిత్సలో సహాయకారిగా ఉంటుంది.
అమ్మవారి రూపాల్లో బ్రహ్మచారిణికి అనుబంధం ఈ ఓషధి. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్రాహ్మి మెదడు కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురికాకుండా సంరక్షిస్తుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి మెదడు ఆరోగ్యానికి హామీ ఇస్తుంది.
అమ్మవారి రూపాల్లో చంద్రఘంటకు సంబంధించిన మూలిక ఇది. కొత్తిమీరను తలపించే చంద్రశూరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనల్జీసిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలం. కీళ్లనొప్పులకు సంబంధించిన ఆర్థరైటిస్, రుమాటిజం నివారణలో ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఇన్ఫెక్షన్లు, గాయాల చికిత్సలో సహాయకారిగా దోహదపడుతుంది.
సిద్ధిధాత్రి అమ్మవారికి అనుబంధంగా ఉండే ఓషధి శతావరి. దీనిలో మన శరీరం ఒత్తిడికి తట్టుకునేలా చేసే సామర్థ్యం ఉంది. శరీర ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థను ఉత్తేజపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. హార్మోన్లను సమతూకంలో ఉంచడం, నెలసరి ఆరోగ్యానికి అండగా నిలవడం, మెనోపాజ్ లక్షణాలను తేలికపరచడం లాంటి ప్రయోజనాలు శతావరితో చేకూరుతాయి.
కాత్యాయని అమ్మవారిలా శక్తిమంతమైనది. పిత్త, కఫ దోషాలను క్రమబద్ధం చేస్తుంది.
ఈ మూలికను కాళరాత్రి అమ్మవారికి అనుబంధంగా పరిగణిస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అజీర్ణం, కడుపుబ్బరం, కడుపునొప్పి, జీర్ణ రసాల ఉత్పత్తి ప్రేరేపణ, పొట్టలో సమస్యల పరిష్కారానికి నాగదమని
అండగా నిలుస్తుంది.
కూష్మాండ రూపానికి ఇది అనుబంధం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటిశాతం ఉండటంతో శరీరానికి మంచి హైడ్రేషన్‌ను ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అరుగుదల, బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయులు అదుపుచేయడంలో బూడిద గుమ్మడి సహాయకారిగా ఉంటుంది. మధుమేహం ఉన్నవాళ్లకు మేలుచేస్తుంది.
మహాగౌరికి అనుబంధంగా ఉంటుంది. ఆధ్యాత్మిక శుద్ధి, భగవంతుడి రక్షణ, స్వస్థత చేకూర్చడంలో తులసిది కీలకపాత్ర. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం, రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా తులసి మన ఆరోగ్యానికి హామీ ఇస్తుంది.
స్కందమాతతో సంబంధం కలిగి ఉండే అవిసెల్లో పోషకాలు, ఔషధ గుణాలు రెండూ ఎక్కువే. ఒమెగా- 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ పుష్కలం. కొలెస్ట్రాల్ స్థాయులను అదుపు చేయడం ద్వారా ఇవి గుండెకు అండగా నిలుస్తాయి. రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.