America | కాలిఫోర్నియా: కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అమెరికా తన ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో పరీక్షించింది. ఈ యుద్ధ విమానాన్ని మానవ పైలట్ కాకుండా ఏఐ నియంత్రిస్తుంది. తాజాగా చేపట్టిన ఈ ప్రయోగంలో యుద్ధ విమానంలో అమెరికా ఎయిర్‌ఫోర్స్ కార్యదర్శి ఫ్రాంక్ కెండాల్ ప్రయాణించారు.
ఎయిర్‌ఫోర్స్ శక్తిని మరింత బలోపేతం చేయాలని అమెరికా ప్రణాళికలు రచిస్తున్నది. 2028 నాటికి వెయ్యికి పైగా మానవ రహిత యుద్ధ విమానాల్లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నది.