Harish Rao | నీ బూతులు రైతుల కడుపు నింపవు.. బూతులు ఆపి సకాలంలో రైతుబంధు ఇవ్వు : హరీష్ రావు
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని.. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు.
Harish Rao | చొప్పదండి నియోజకవర్గం, కురిక్యాల గ్రామం కొండన్నపల్లి బ్రిడ్జి వద్ద వరద కాలువను మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. గోపాల్ రావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించగా.. రైతులు ఎండిపోయిన పొలాలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన గ్రామంలో‘రైతులతో మాట ముచ్చట’కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని స్పష్టం చేశారు. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. మొన్న లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలకు నీళ్లు వదిలారు. మరి ఆ వరద కాలువలలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా..? అని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడుస్తుంటేనే కదా ఈ నీళ్లు వచ్చాయన్నారు.
సకాలంలో రైతుబంధు ఇవ్వు..
ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిన రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మండిపడ్డారు. నీ బూతులు రైతుల కడుపు నింపవు.. బూతులు ఆపి.. సకాలంలో రైతుబంధు ఇవ్వు, యూరియా ఇవ్వు అని రేవంత్ రెడ్డికి సూచించారు.
కేసీఆర్ రెండు పంటలకు రైతు బంధు ఇస్తే.. మూడు పంటలకు రైతు బంధు ఇయ్యాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇయ్యాలా మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినంక ఇచ్చేవి 5 రైతు బంధులు.. వాటిలో రెండిచ్చినవు.. మూడు ఎగ్గొట్టినవ్.. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద లేదు. నీకు బూతుల మీదున్న ప్రేమ రైతులపై లేదు. పోయిన యాసంగికి బోనస ఎగ్గొట్టినవ్.. ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవ్. వడగండ్ల వానకు, తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళ్టికి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా మారాడన్నారు.
‘99 రోజుల ప్రణాళిక’అంటూ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తారు. అసలు ఏం చేశావని 99 రోజుల ప్రణాళిక పెట్టావని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఏం మొహం పెట్టుకొని 99 రోజుల ప్రణాళికకు పోతున్నావు..? రైతులకు, మహిళలకు ఏం చెబుతావు..అవ్వా తాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చావా? భర్త చనిపోయిన చెల్లెమ్మలకు పెన్షన్ ఇచ్చావా? మూడు లక్షల పెన్షన్లు తీసేసావు తప్ప.. నువ్వు ఇచ్చింది ఒకటి కూడా లేదని హరీష్ రావు మండిపడ్డారు.
గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి నెలకు రూ. 2500 ఎగ్గొట్టిన అని చెబుతావా..? రైతులకు రైతుబంధు ఎగ్గొట్టి, యూరియా దొరకకుండా చేసిన అని చెబుతావా..? నీ 99 రోజుల ప్రణాళికలో పోలీసుల భద్రత లేకుండా జనాల్లోకి రా.. అప్పుడు నువ్వు చేసిన మోసాలకు ప్రజలే నీ సంగతి ఏంటో చెప్తరని హెచ్చరించారు.
Live: చొప్పదండి నియోజకవర్గం, కురిక్యాల గ్రామం కొండన్నపల్లి బ్రిడ్జి వద్ద వరద కాలువను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు https://t.co/82Kh9mbIax
— Office of Harish Rao (@HarishRaoOffice) March 7, 2026
LIVE: చొప్పదండి నియోజకవర్గం, గోపాల్ రావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
https://t.co/KcnVcDLBBr— BRS Party (@BRSparty) March 7, 2026
LIVE: చొప్పదండి నియోజకవర్గం, గోపాల్ రావుపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish “రైతులతో మాట ముచ్చట” https://t.co/DIJjBSB8nZ
— BRS Party (@BRSparty) March 7, 2026
Read Also :
ATM theft | అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ.. 1.60 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Hyderabad | రెండో పెళ్లి చేసుకున్న హోంగార్డు.. విషయం బయటపడటంతో రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌కు!
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

