Hardeep Singh Nijjar | నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
Hardeep Singh Nijjar | ఒట్టావ, మే 3: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిజ్జర్ హత్య కోసం భారత్ ఏర్పాటుచేసినట్టుగా చెబుతున్న హిట్‌స్వాడ్‌లో వీరు సభ్యులని అక్కడి మీడియా నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది జూన్ 18న సాయంత్రం సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, భారత్ ఏజెంట్లే అతడిని హతమార్చారంటూ గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన క్రమంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెనడా ఆరోపణలు అర్థం లేనివి, ప్రేరేపితమైనవని భారత్ ఖండించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు నిజ్జర్ హత్యకు కుట్ర పన్నిన హిట్ స్కాడ్ సభ్యులను గుర్తించి కొందరిని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు కెనడా బీబీసీ ప్రకటించింది. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించినా వారి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

