Sonali Bendre | అదే చివరి సినిమా అనుకున్నా!: సోనాలి బింద్రే
టాలీవుడ్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు సరసన హీరోయిన్గా నటించింది సోనాలి బింద్రే. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. క్యాన్సర్ బారినపడి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది.
Sonali Bendre | టాలీవుడ్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు సరసన హీరోయిన్గా నటించింది సోనాలి బింద్రే. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. క్యాన్సర్ బారినపడి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ‘ద బ్రోకెన్ న్యూస్2’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలను తాజాగా బయటపెట్టింది ఈ బ్యూటీ. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉండేవారు.
నిర్మాతలు అందరూ నన్ను కాస్త లావవ్వమని చెప్పేవారు. ఇలా ఉంటే అవకాశాలు దక్కవని భయపెట్టేవారు. సన్నగా ఉన్నానని హేళన చేసేవారు. నా నల్లటి జుట్టుపై కూడా విమర్శలు వచ్చేవి. అయినా, నేనెప్పుడూ కంగారుపడలేదు. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడిచాను. డ్యాన్స్ రాకపోతే ఇండస్ట్రీలో మనుగడ ఉండదని చాలా మంది అనుకుంటారు. సినిమాల్లోకి వచ్చేప్పటికి నాకు డ్యాన్స్ రాదు.
ఆ కారణంగా డ్యాన్స్ మాస్టర్లు తిట్టేవారు. ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో ‘హమ్మ… హమ్మ’ పాట చేసే అవకాశం దక్కింది. అప్పటివరకు నేను చేసినవి కేవలం ఐదు సినిమాలు మాత్రమే. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్. ఎలాగైనా ఆ పాటలో బాగా డ్యాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. లేదంటే అదే చివరి సినిమా అనుకున్నా! ‘హమ్మ.. హమ్మ’ పాటతో ఊహించనంత గుర్తింపు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయి. ‘ద బ్రోకెన్ న్యూస్ 2’లో నా పాత్ర అందరికీ నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

