సన్నవడ్లకు మద్దతు ధర ఏది?
జగిత్యాల బీట్‌లో సౌకర్యాలు లేకపోవడం, సన్నవడ్లు, జైశ్రీరామ్ వడ్లకు సైతం క్వింటాకు రూ.2,500 ధర పలుకకపోవడంపై రైతులు నిరాశలో మునిగిపోయారు.
- ధాన్యం కొనుగోలులో జాప్యమెందుకు?
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
- రైతులతో కలిసి జగిత్యాలలో ధర్నా
- పంట కొనాలని సీఐ కాళ్లు మొక్కబోయిన మహిళా రైతు
జగిత్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల బీట్‌లో సౌకర్యాలు లేకపోవడం, సన్నవడ్లు, జైశ్రీరామ్ వడ్లకు సైతం క్వింటాకు రూ.2,500 ధర పలుకకపోవడంపై రైతులు నిరాశలో మునిగిపోయారు. ఆదివారం తెచ్చిన ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించకపోవడం, సోమ, మంగళవారాల్లో బీట్ బంద్ చేస్తున్నట్టు పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితర నాయకులు సోమవారం బీట్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు బీట్‌కు వచ్చే సరికే పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ధాన్యం వచ్చి నిలిచి ఉండటం, బీట్‌లో స్థలం లేకపోవడం, కొనుగోళ్ల విషయంలో మార్కెట్ సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు.
ఈ క్ర మంలోనే జీవన్‌రెడ్డి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయగా, మహిళా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇష్టారాజ్యంగా మారెట్‌కు అప్రకటిత సెలవులు ప్రకటించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జై శ్రీరామ్ సహా ఏ సన్నరకానికి రూ.3,000 పెట్టకపోవడం సరికాదని అన్నారు. నిన్నటికి, ఈ రోజుకు ధర ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ధాన్యం ట్రాక్టర్లు క్యూ కడితే బీట్‌లో అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. చల్గల్ మార్కెట్‌యార్డులో కేవలం ఒక ట్రేడర్ మాత్రమే కొనుగోలు చేసేలా అనుమతించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మిగిలిన ట్రేడర్లు చల్గల్కు ఎందుకు వెళ్లడం లేదని మారెట్ సెక్రటరీని నిలదీశారు. రైతులు మాట్లాడుతుంటే కార్యదర్శి వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు క్వింటాల్ ధాన్యం కూడా సేకరించకపోవడం అన్యాయమని అన్నారు. అనంతరం రైతులతో కలిసి జీవన్‌రెడ్డి, దావ వసంత, పార్టీ శ్రేణులు నిజామాబాద్-జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ కాళ్లపై రైతు ఎల్లవ్వ పడింది. ధాన్యం కొనిపించాలని, సన్నవడ్లకు ధర వచ్చేలా చూడాలని వేడుకున్నది. ధాన్యం చల్గల్కు బీట్‌కు తరలిస్తామని మార్కెట్ సెక్రెటరీ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణు లు, రైతులు ధర్నా విరమింపజేశారు. ‘సన్న అడ్లు పె ట్టుండ్రి.. పెట్టుండ్రి అంటూ ఒర్రిచ్చిండ్రు. అష్టకష్టాలు పడి పండించిన వడ్లను జైతాల బీట్లకు వచ్చినం. ఇక్కడ అన్యాయం, దోపిడీ ఉన్నది సార్.. అని కాచారం మహిళా రైతు అంగల అమృతవ్వ ఆవేదన వ్యక్తంచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

