‘వారణాసి’ షూటింగ్ పూర్తి
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ ‘వారణాసి’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం చిత్రబృందం వెల్లడించింది.
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ ‘వారణాసి’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సినిమా అప్డేట్ గురించి సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు. అందుకు ‘వారణాసి’ టీమ్ స్పందిస్తూ ‘షూటింగ్ అయిపోయింది. సీజీ వర్క్, రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.
డబ్బింగ్ ప్రారంభించాల్సి ఉంది. ఇది మీకు అప్డేట్లా అనిపిస్తే ఓకే. లేదంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పుడు అసలైన బ్లాస్ట్ ఉంటుంది’ అని తెలిపారు. టైమ్ ట్రావెల్, మైథాలజీ నేపథ్యలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు రుద్రగా, ప్రియాంకచోప్రా మందాకినిగా కనిపించనున్నారు. ప్రతినాయకుడు కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్‌ప్రొడక్షన్ దశకు చేరుకోవడంతో ఈ గ్లోబల్ అడ్వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

