పెళ్లి తప్పనిసరి కాదు!
అగ్ర కథానాయిక శృతిహాసన్ ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది. తాజాగా పెళ్లి గురించి ఈ భామ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
అగ్ర కథానాయిక శృతిహాసన్ ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది. తాజాగా పెళ్లి గురించి ఈ భామ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతీ ఒక్కరి జీవితంలో తోడు ముఖ్యమేనని, అయితే అందుకోసం పెళ్లి చేసుకోవడం తప్పనిసరి కాదని అభిప్రాయపడింది. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది. ‘పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. కానీ పెళ్లి కోసం పత్రాలపై సంతకాలు చేయడం, భారీగా డబ్బులు ఖర్చు పెట్టి వేడుకలు చేయడం ఎవరిని సంతృప్తిపరచడానికో అర్థం కాదు.
నేను కొన్ని విషయాల్లో సంప్రదాయబద్దంగా ఉంటాను. మరికొన్ని విషయాల్లో నా ఆలోచనలు ప్రాక్టికల్‌గా ఉంటాయి’ అని శృతిహాసన్ చెప్పింది. శృతిహాసన్ గతంలో ఆర్టిస్టు శంతను హజారికాతో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉంది. 2024లో వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

