BRS | బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి : బహ్రెయిన్ శాఖ పిలుపు
BRS | రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS ) అభ్యర్థులను గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (Bahrain ) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS ) అభ్యర్థులను గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (Bahrain ) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటలకు నీరందక రైతులు, తాగునీరు అందక సతమతమవుతున్నారని పేర్కొన్నారు.
పేదలకు పింఛన్లు (Pensions) అందడం లేదని ఎన్నికల ప్రచారంలో అధినేత కేసీఆర్ (KCR) కు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. పదేండ్లు కరువు లేదు. నిండా నీటితో జలాశయాలు. కాంగ్రెస్ పాలన (Congress rule) లో నాలుగు నెలలకే మళ్లీ కరువును చూస్తున్నాం.
కాంగ్రెస్ మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక చేతులెత్తేసారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం విప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, బొలిశెట్టి ప్రమోద్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య , తిప్పారవేణి శ్రీనివాస్ , మెరుగు శ్రీనివాస్, కొందరి రాజేందర్, పెనుగొండ శ్రీకాంత్ , కోటగిరి శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

