Third Gender Candidate | లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తొలి థర్డ్ జెండర్ వ్యక్తి
Third Gender Candidate | తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు.
న్యూఢిల్లీ: తొలి థర్డ్ జెండర్ వ్యక్తి (Third Gender Candidate) లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు. ధోతీ, టోపీ, ఆభరణాలు ధరించిన అతడు ఒంటరిగా వచ్చి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాడు. చేతిలో లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.10,000కుపైగా డబ్బు కలిపి సుమారు రూ.15.10 లక్షల చరాస్తులున్నట్లు అఫిడవిట్లో ప్రకటించాడు. అయితే ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నాడు.
కాగా, 2010లో బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపాడు. థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అంగీకారం, హక్కుల కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పాడు. సుధీర్ఘ ప్రక్రియ వల్ల థర్డ్ జెండర్‌గా ధృవీకరణ ప్రతాలు పొందేందుకు మూడేళ్లకుపైగా పట్టిందని అన్నాడు.
మరోవైపు థర్డ్ జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు వంటి ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం కల్పించాలని రాజన్ సింగ్ కోరాడు. విద్యా, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు జాతీయ ట్రాన్స్ జెండర్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. ఎన్నికల్లో తాను గెలిస్తే థర్డ్ జండర్ వ్యక్తులకు సంబంధించిన ప్రాథమిక అవసరాలు తీరుస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానని మీడియాతో అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Candidate
- Delhi
- Files
- Nomination
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

