Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
Health tips | మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు (Kidneys) కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా విసర్జింపజేయడం కిడ్నీల ప్రధానమైన విధి. కిడ్నీల పనితీరు క్షీణించి, శరీరంలోని టాక్సిన్ల (Toxins) తొలగింపు విధులను సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ సమస్యలు (Kidney problems) వస్తాయి.
Health tips : మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు (Kidneys) కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా విసర్జింపజేయడం కిడ్నీల ప్రధానమైన విధి. కిడ్నీల పనితీరు క్షీణించి, శరీరంలోని టాక్సిన్ల (Toxins) తొలగింపు విధులను సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ సమస్యలు (Kidney problems) వస్తాయి. అయితే కిడ్నీల పనితీరు 90% క్షీణించే వరకు లక్షణాలు కనపడకపోవచ్చు. పనితీరు బాగా తగ్గిన తర్వాత మాత్రమే లక్షణాలు కనపడతాయి. కిడ్నీ పనితీరు సక్రమంగా లేనప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కాళ్లు, ముఖం ఉబ్బడం : కిడ్నీలు మలినాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతే శరీరంలో ద్రవం నిల్వలు పేరుకుపోతాయి. దాంతో కాళ్లు, ముఖం శరీరంలోని ఇతర భాగాలు నీరు నిండి ఉబ్బుతాయి.
చిన్నప్పుడే హైబీపీ : చిన్న వయస్సులోనే రక్తపోటు పెరగడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
రాత్రిళ్లు అతిగా యూరిన్ : రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం కూడా కిడ్నీ పనితీరు తగ్గి్ందనడానికి సంకేతంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యూరిన్‌లో రక్తం : మూత్రంలో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు కాఫీ రంగులో కనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతంగా అనుమానించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్వాస సమస్యలు : కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవాల నిల్వలు పేరుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శ్వాస ఇబ్బందిగా మారడం కూడా కిడ్నీ వైఫల్యానికి సంకేతంగా భావించవచ్చు.
అన్నం సహించకపోవడం : కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు అవుతాయి. అన్నం సహించదు. శరీరంలో దురదలు వస్తాయి.
గమనిక : పై లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీలు వైఫల్యం చెందినట్లు కాదు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సంబంధిత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. దానివల్ల ఒకవేళ సమస్య ఉంటే మరింత తీవ్రం కాకముందే చికిత్స తీసుకోవచ్చు. సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

