TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
TTD | ఆపద్బాంధవుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను కొద్ది గంటల్లోనే టీటీడీ విజిలెన్స్ అధికారులు సాంకేతిక నైపుణ్యంతో తిరిగి అప్పగించారు.
తిరుమల : ఆపద్బాంధవుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను ( Gold Ornaments ) కొద్ది గంటల్లోనే టీటీడీ ( TTD ) విజిలెన్స్ అధికారులు సాంకేతిక నైపుణ్యంతో తిరిగి అప్పగించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన జి.మహేష్ ( Mahesh ) అనే భక్తుడు గురువారం సాయంత్రం 4:30 గంటలకు సీఆర్వో ( CRO ) ఆఫీస్ బస్ స్టాప్ వద్ద అత్యవసరంగా కారు నుంచి దిగే సమయంలో తన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడిచారు.కొద్దిసేపటి తరువాత ఆభరణాలు పోయినట్లు గుర్తించి, తిరుమల కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించారు.
కమాండ్ కంట్రోల్ సిబ్బంది వెంటనే సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ ( CCTV ) ఫుటేజ్‌ను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు ఆ ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించారు. తిరువణ్ణామలైకు చెందిన భక్తుడి లగేజ్ వివరాల ఆధారంగా గుర్తించి అతని వద్ద నుంచి రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్లెట్ మొత్తం సుమారు 52 గ్రాములు శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.
రెండో వ్యక్తి ఉచిత దర్శనానికి వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించి, ప్లేబ్యాక్ సహాయంతో అతని కదలికలను ట్రాక్ చేసి నారాయణగిరి షెడ్ నంబర్-7లో ఉన్నట్లు గుర్తించి ,అతని వద్ద ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని శుక్రవారం ఉదయం భక్తుడికి అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

