Dial Your EO | శ్రీవారి భక్తుల కోసం మే 3న డయల్ యువర్ ఈవో
Dial Your EO | ఈనెల 3న డయల్యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల : తిరుమల,తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయాల్లో సౌకర్యాల కల్పన, ఇతర సమస్యలను విన్నవించడానికి ఈనెల 3న డయల్యువర్ ఈవో (Dial Your EO) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో భక్తులు నేరుగా ఫోన్ ద్వారా తమ సమస్యలను ఈవో ధర్మారెడ్డికి వివరించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వివరించారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను నెంబరు 0877-2263261 ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వెల్లడించారు.
శ్రీవారి ఆలయానికి రూ. 3.59 కోట్లు ఆదాయం రాక
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆరు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 72,310 మంది భక్తులు దర్శించుకోగా 28,731 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.59 కోట్లు వచ్చిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

