హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ప్రధాన కార్యదర్శి వంశీధర్ పేర్కొన్నారు. టోర్నీలో సబ్‌జూనియర్, జూనియర్, పురుషుల, మహిళల, మాస్టర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 లోపు ఆన్లైన్లో https:// btronlin.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.