లండన్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు(Launch ceremony)లండన్లో ఘనంగా జరిగాయి. లండన్(London) సమీపంలోని రీడింగ్ పట్టణ ఎన్నారై బీఆర్ఎస్ పార్టీ(BRS party) కార్యాలయంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులంతా కలిసి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మేమంతా కేసీఆర్ వెంటే అంటూ ఎన్నారైలు నినదించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమ సమయం నుంచి మొట్ట మొదటి సారి ఖండాంతరాల్లో లండన్ గడ్డ పై గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్ వెంటే ఉండి స్వరాష్ట్ర సాధనలో మా బాధ్యత నిర్వహించామన్నారు.