తుంగతుర్తి, సెప్టెంబర్ 25 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ పట్టాభి రామచంద్ర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి ఆవరణలో మొక్క నాటారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు తునికి సాయిలు గౌడ్, గొపగాని రమేష్ గౌడ్, తడకమళ్ల రవికుమార్, గోపగాని శ్రీనివాస్, వీరోజి మల్లెపాక రాములు, మట్టిపల్లి వెంకట్, పూర్ణ నాయక్, మిరియాల వెంకట్, ఉప్పుల నాగమల్లు, భాస్కర్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, తడకమళ్ల మల్లికార్జున్, వెంకటేష్, మధు పాల్గొన్నారు.

ఘనంగా గుజ్జ యుగంధర్ జన్మదిన వేడుకలు