Brij Bhushan | లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు షాక్.. నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేసిన రెజ్లర్లు
Brij Bhushan : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు కోర్టును ఆశ్రయించారు.
Brij Bhushan : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు మరో నిందితుడు వినోద్ తోమార్పై కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఇటీవల మెజిస్ట్రేట్ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో తాము కోర్టులో సమర్పించిన సాక్ష్యాలను తప్పుగా, పరిమితంగానే పరిశీలించారని పిటిషన్ దాఖలు చేసిన రెజ్లర్లు కోర్టుకు వివరించారు. ఈ విషయంలో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అంచనాలు, ఊహాగానాల ఆధారంగా జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు విచారణ సరిగ్గా జరగలేదని, సరైన చట్టాలు వర్తించేలా పరిశీలన జరగలేదని పిటిషన్లో వివరించారు.
ఇదే సమయంలో తమ ప్రవర్తన, వ్యక్తిత్వం విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. లైంగిక వేధింపుల బాధితులు ఎలా ప్రవర్తిస్తారు అనే అంశంలో ఉన్న పాతకాలపు పద్ధతుల్ని, అంచనాల్ని ఆధారంగా చేసుకుని కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించిందని రెజ్లర్లు ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణలో భాగంగా.. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును, విచారణ తీరును కూడా పరిశీలించాల్సిందిగా కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

