Sivakarthikeyan | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఎస్కే27’ (SK27) అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ (Sathya Jyothi Films) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పార్కింగ్’ (Parking) చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రామ్‌కుమార్ (Ramkumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు గ్రాండ్‌గా మొదలయ్యాయి.
ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, యువ సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివకార్తికేయన్ తన తదుపరి సినిమాలతో పాటు ఈ ‘ఎస్కే27’ షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా బ్యాలెన్స్ చేయనున్నారు.