Lara Datta | భారీ ప్రాజెక్టులు, ప్రతిష్ఠాత్మక చిత్రాలలో భాగం కావాలని నటీనటులు కోరుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో ‘రామాయణ్’ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటిస్తున్న వారి గురించి రోజుకో వార్త బయటికి వస్తున్నది. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న లారా దత్తా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ వార్తలపై.. “రామాయణ్’ లాంటి సినిమాలో భాగం కావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే, ఇందులో నటించాలని ఇప్పటివరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. రామాయణ్‌లో కైకేయి పాత్ర నేను చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే శూర్పణఖ, మండోదరి పాత్రలు చేయడానికైనా రెడీ. ఈ మూడు క్యారెక్టర్లలో దేనికైనా నేను న్యాయం చేస్తాను’ అని చెప్పింది లారా దత్తా.