Afghan diplomat | 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఆఫ్ఘాన్ దౌత్యవేత్త
Afghan diplomat | అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ (gold smuggling) చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు.
Afghan diplomat | అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ (gold smuggling) చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో నిలిచారు. ఆ అధికారిణి ఎవరో కాదు భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్ (Zakia Wardak).
వార్దక్ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్ ఫ్లైట్‌లో కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి భారత్ వచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో (Mumbai airport) ల్యాండ్ అవ్వగానే ఆమె గ్రీన్ ఛానెల్ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. అయితే, వార్దక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence)కు ముందుగానే సమాచారం అందింది.
దీంతో వారు అలర్ట్ అయ్యి ఎయిర్‌పోర్ట్‌లో సిబ్బందిని మోహరించారు. కానీ, దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకుని స్మగ్లింగ్ గురించి ఆరా తీశారు. బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె అలాంటివేమీ తమ వద్ద లేవని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు వార్దక్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా.. ఆమె బండారం మొత్తం బయటపడింది.
ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, లెగ్గిన్, మోకాలి క్యాప్‌లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆమె కుమారుడి వద్ద మాత్రం ఎలాంటి బంగారం కనిపించలేదు. దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేయడం చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా వార్దక్‌ను డీఆర్ఐ అధికారులు అడగ్గా.. ఆమె చూపించలేకపోయింది. దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ దౌత్యవేత్తపై కస్టమ్స్ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. కానీ, వార్దాక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు.
Also Read..
Aishwarya Rajinikanth | కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఐశ్వర్య రజనీకాంత్.. మురిసిపోయిన సూపర్ స్టార్
School Principal | స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై దాడి చేసిన లేడీ ప్రిన్సిపాల్
Congresss | హస్తం పార్టీకి మరో షాక్.. ఎన్నికల ప్రచారానికి నిధులు ఇవ్వకపోవడంతో పోటీకి నిరాకరణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

