KCR | కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వణికిపోతున్నారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ప్రశ్నించారు. దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసల వెతను తీర్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు.. కేసీఆర్కు అంతటా నీరాజనం పడుతూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్పై నిషేధం ఒక రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టుపై కూడా గుర్రాల నాగరాజు స్పందించారు. క్రిశాంక్ అరెస్టు అక్రమమని అభిప్రాయపడ్డారు.