నల్ల చట్టాల నిరసన
నా దేశంలో నేను నన్ను నేను కాపాడుకునే స్థితికి వచ్చాను నాగలి పట్టే చేతులతో నల్ల జెండాలు పట్టించారు.
నా దేశంలో నేను
నన్ను నేను కాపాడుకునే
స్థితికి వచ్చాను
నాగలి పట్టే చేతులతో
నల్ల జెండాలు పట్టించారు
ఇదేనా నా దేశ దుస్థితి
నల్ల చట్టాల రద్దు కొరకు
నా దేశం నడిరోడ్లపై నిరసనలు
ఇదేనా దేశ ప్రగతి
నా స్వాతంత్య్ర దేశంలో
నల్లజాతిపై నన్ను నేను
కాపాడుకునే రక్షణ నిరసన
అన్నం పెట్టే రైతునే
ఆగం పట్టిస్తే
ఆఖరికి మిగిలేది
బతుకు శూన్యమే
ఆకలి తీర్చే
అన్నపూర్ణమ్మను
అణచ చూస్తే
ప్రపంచంలో మిగిలేది శూన్యం
రైతు రాశులు పోసిన
ధాన్యాన్ని రాల్చకుంటే
ప్రపంచానికి పట్టెడన్నం
పెట్టే శక్తి ఎవడికుంది
ఎవడు పెట్టగలడు
నేను దున్నే సత్తువ
మట్టిలో పొర్లే గుణం
ఇత్తును నాటే బలం
ఏ రాజుకు ఉంది
అంతరిక్షంలో
చంద్ర మండలం చేరినా
రైతు బురద నుంచి
బువ్వ తియ్యకుంటే
చంద్ర మండలం చేరే శక్తి ఎవరిది
సృష్టి తర్వాత జీవం నిలవడానికి ప్రత్యామ్నాయంగా
ప్రపంచాన్ని గడగడలాడించిన
అలెగ్జాండర్ అయినా
ఆస్తి లేకుండా ఒట్టి చేతులతో
ఒరిగిపోయాడు నేలకు
రైతు లేని రాజ్యముల
దేవుడున్న దేశముల
ఏమి చూడగలము
అంధకార మగుబడును
దేవుడు లేని దేశముల
రైతున్న రాజ్యముల
ఏమి చూడగలము
వెలుగు చూడగలము
కిసాన్‌ను కించపరిచి
గుళ్లకు పెట్టే వ్యయం
రైతులకు రాసి పోస్తే
రాదు దేశాన కరువు
నల్ల చట్టాల పోరు
రాదనుకున్న దేశాన
రానే వచ్చింది రైతుల నిరసన
దేవరపాగ కృష్ణయ్య
99634 49579
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

