ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 23:53:18

పెరిగిన గాలి నాణ్యత

పెరిగిన గాలి నాణ్యత

  • రాష్ట్రంలో తగ్గిన వాయుకాలుష్యం
  • అంతా లాక్‌డౌన్‌, వర్షాల ప్రభావమే 
  • సీపీసీబీ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పరిశ్రమలు, వాహనాల పొగతో భారీగా పెరిగిన వాయుకాలుష్యం.. కరోనా దెబ్బకు తగ్గుముఖం పట్టింది. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమలు మూతపడటం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో గాలిలో నాణ్యత పెరిగింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక మళ్లీ కాలుష్యం పెరగడం మొదలైంది. కానీ, అదే సమయంలో నైరుతి రుతుపవనాలు రాష్ర్టాన్ని పలకరించడంతో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిందని తెలంగాణ కాలుష్య ని యంత్రణ మండలి అధికారులు తెలిపారు.

 దీంతో రాష్ట్రంలో గాలి నాణ్యత సూచీ గుడ్‌ కేటగిరీలోకి చేరిందని వెల్లడించారు. ఎండ లు పెరిగితే రోడ్లపై ధూళి, దుమ్ముతో కాలు ష్యం పెరిగే అవకాశం ఉందని, చలికాలంలోనూ చల్లదనం, వాతావరణ ప్రతికూలతలు, ఇతరత్రా కారణాలతో వాయు కాలు ష్యం పెరుగుతుందని వివరించారు. కాగా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్‌ యాప్‌' ద్వారా దేశవ్యాప్తంగా వందకు పైగా ముఖ్య నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత , వివిధ కాలుష్య స్థాయిలను పరిశీలించి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) గణాంకాల సూచీని వెల్లడించింది. దానిప్రకారం రాష్ట్రంలోని పలు కీలక ప్రాం తాల్లో గాలి నాణ్యత ఆశాజనక స్థాయిలో ఉన్నట్లు తేలింది.logo