CSIR | ముడతలు మంచివే.. సోమవారం ఐరన్ చేయనిదుస్తులు ధరించండి..!
CSIR | పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు.
- ఉద్యోగులకు సీఎస్ఐఆర్ సూచన
- పర్యావరణ పరిరక్షణకు నిర్ణయం
న్యూఢిల్లీ, మే 7: పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు. వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు ‘స్వచ్ఛత పక్వాడ’లో భాగంగా ఈ నెల 1-15 తేదీల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం తాము వేసుకొనే దుస్తులను ఇస్త్రీ చేయకుండా ఉండటం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంస్థ అన్ని ప్రయోగశాలలు, పని ప్రదేశాల్లో విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా కరెంటు బిల్లును 10% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీన్ని ఈ ఏడాది జూన్-ఆగస్ట్ మధ్యలో అమలు చేయనున్నారు. విద్యుత్తు పొదుపు కోసం తాము చేపట్టిన చొరవ ద్వారా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచుతామని సీఎస్ఐఆర్ అధికారులు తెలిపారు. అతి చిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించేందుకు ఎలా దోహదపడతాయో ప్రజలకు వివరిస్తామని వారు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

