Turkish Drone | పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో సభ్యదేశం తుర్కియేకు చెందిన డ్రోన్ (Turkish Drone)ను అగ్రరాజ్యం అమెరికా (America) కూల్చివేసింది. సిరియా (Syria)లో మోహరించిన తమ దళాలకు సమీపంలోకి వచ్చిన సాయుధ తుర్కియే డ్రోన్‌ను గురువారం నేలకూల్చింది. ఈ విషయాన్ని పెంటగాన్ (Pentagon) తాజాగా వెల్లడించింది. నాటో (NATO) మిత్రదేశమైన తుర్కియేకి చెందిన డ్రోన్‌ను వాషింగ్టన్ నేలకూల్చడం ఇదే తొలిసారి అని పెంటగాన్ తెలిపింది.
కాగా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అమెరికా బలగాలు సిరియాలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. వాషింగ్టన్కు చెందిన సుమారు 1000 మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఈ క్రమంలో వారు ఏర్పాటు చేసుకున్న హసాకా సమీపంలోని మిలటరీ క్యాంపు నిషేధిత ఆపరేటింగ్ జోన్ సమీపంలోకి తుర్కియేకి చెందిన కొన్ని డ్రోన్లు వచ్చాయి. అమెరికా బలగాలు ఉన్న ప్రాంతం నుంచి సుమారు కిలో మీటరు దూరం వరకూ ఆ డ్రోన్లు వచ్చి వెళ్లిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక డ్రోన్ ఆ నిషేధిత జోన్లోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అమెరికా బలగాలు ఫైటర్‌జెట్-16తో (US F-16 fighter aircraft) డ్రోన్‌ను నేలకూల్చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
WAR: A United States F-16 fighter jet shot down a Turkish drone operating near American troops in Syria. Will Turkey, a NATO member, invoke Article 5? Is this the end of the NATO alliance?pic.twitter.com/xProiDBl9r
— @amuse (@amuse) October 5, 2023
Also Read..
Syrian Military Academy | సిరియా మిలటరీ అకాడమీపై బాంబుల వర్షం.. 100 మందికిపైగా మృతి
Rachin Ravindra: రాహుల్ ద్రావిడ్ + సచిన్ టెండూల్కర్ = రచిన్ రవీంద్ర
Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్టరీ.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్