MP Prajwal Revanna | ‘సెక్స్ స్కాండల్’లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్
కర్ణాటక రాజకీయాల్లో ‘సెక్స్ స్కాండల్' సంచలనంగా మారింది. జేడీఎస్ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్‌గా మారాయి.
- జేడీఎస్ ఎంపీ అశ్లీల వీడియోలు వైరల్
- కర్ణాటక రాజకీయాల్లో దుమారం
- ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు నమోదు
- జర్మనీ పారిపోయిన ప్రజ్వల్!
MP Prajwal Revanna | బెంగళూరు, ఏప్రిల్ 28: కర్ణాటక రాజకీయాల్లో ‘సెక్స్ స్కాండల్’ సంచలనంగా మారింది. జేడీఎస్ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్‌గా మారాయి. హసన్ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ జరగగా అంతకు రెండు రోజుల ముందు నుంచి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడకు ప్రజ్వల్ స్వయానా మనవడు కావడంతో ఈ అంశం మరింత సంచలనం సృష్టిస్తున్నది. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు శనివారం ఆందోళన నిర్వహించారు. మరోవైపు, ఓ మహిళ ఫిర్యాదు మేరకు దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
స్పందించిన సీఎం.. సిట్ ఏర్పాటు
అశ్లీల వీడియోలపై సమగ్ర విచారణకు సీఎం సిద్ధరామయ్య సిట్ ఏర్పాటు చేశారు. వీడియోల్లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఉన్నదని ఆయన అన్నారు. హోళెనరసిపుర పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, కుట్రలో భాగంగానే నవీన్ గౌడ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నట్టు తన ఎన్నికల ఏజెంట్ ద్వారా ప్రజ్వల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జర్మనీ పారిపోయిన ప్రజ్వల్!
సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయమే ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ప్రజ్వల్ విదేశాలకు వెళితే అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్‌దేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

