Tirumala | తిరుమలలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు
Tirumala | తిరుమల లో వచ్చే నెల జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) లో వచ్చే నెల లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం, 4న సర్వ ఏకాదశి, 10న అక్షయతృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, 23న అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శ్రీవారి ఆదాయం రూ. 2.88 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshanam ) కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 81,212 మంది భక్తులు దర్శించుకోగా 41,690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వార హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చిందని టీటీడీ వివరించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

