గ్రహణ సందేశం
సూర్యుడి కుటుంబంలో బుధుడు, శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు, అంగారకుడికి ఫాబోస్, డైమోస్, ఇక బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు ఉన్నాయి.
సూర్యుడి కుటుంబంలో బుధుడు, శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు, అంగారకుడికి ఫాబోస్, డైమోస్, ఇక బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగితే, ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఏర్పాటు కారణంగా సూర్యుడికి, సంబంధిత గ్రహానికి మధ్య ఉపగ్రహం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. భూమి విషయంలో… సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుంది. ఈ సమయంలో సూర్యుడు పాక్షికంగానో, పూర్తిగానో కనిపించడు.
ఈ ఖగోళ అద్భుతాన్ని సూర్య గ్రహణం అని పిలుస్తారు. ఇక సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి రావడం వల్ల మనకు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మరో కోణంలో చూస్తే… ఇది చంద్రుడికి సూర్యగ్రహణం అవుతుంది. గ్రహణాలు భూమ్మీద వచ్చినా, ఇతర గ్రహాల మీద వచ్చినా… మనిషి ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సత్యాన్వేషణలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయనే సందేశం వీటిలో ఇమిడి ఉంటుంది. అవాంతరాలు ఎదురైనా అవి తాత్కాలికమే… సత్యం నిత్యంగా వెలుగుతూ ఉంటుందని గ్రహణాలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి, సత్యాన్ని తెలుసుకునే క్రమంలో మనం సహనంతో, అచంచలమైన విశ్వాసంతో ఉంటే ఆటంకాలు వాటంతట అవే పక్కకు తొలగిపోతాయి. ఇదే గ్రహణ సందేశం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

