Brahmotsavams | మే 16 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Brahmotsavams | తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) మే 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయని అధికారులు వివరించారు.
తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) మే 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయని అధికారులు వివరించారు. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు.
16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం, 17న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. 18న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 19న ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం, 20న ఉదయం మోహినీ (Mohini) అవతారం , రాత్రి గరుడ (Garuda) వాహనంపై స్వామివారు ఊరేగుతారని తెలిపారు.
21న ఉదయం హనుమంత వాహనం , రాత్రి గజ వాహనం , 22 ఉదయం సూర్యప్రభ వాహనం , రాత్రి చంద్రప్రభ వాహనం, 23న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం , 24న ఉదయం – చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

