Profession | ఇలా ఉండొద్దు బాస్!
‘బాస్' అనగానే కొందరికి కొమ్ములు వచ్చేస్తాయి. తమంత గొప్పవారు లేరని బలంగా నమ్ముతారు.ఆ ఫీలింగ్ నుంచి రకరకాల బాస్‌లు బయటికి వస్తారు. కొందరు ఉద్యోగులను శాసిస్తారు.ఇంకొందరు శాడిస్టుల్లా మారిపోతారు. ‘ఎస్ బాస్..’ అన్నప్పుడు ఉప్పొంగే వీళ్లు... ‘నో బాస్..’ అన్నామో అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
Profession | ‘బాస్’ అనగానే కొందరికి కొమ్ములు వచ్చేస్తాయి. తమంత గొప్పవారు లేరని బలంగా నమ్ముతారు.ఆ ఫీలింగ్ నుంచి రకరకాల బాస్‌లు బయటికి వస్తారు. కొందరు ఉద్యోగులను శాసిస్తారు.ఇంకొందరు శాడిస్టుల్లా మారిపోతారు. ‘ఎస్ బాస్..’ అన్నప్పుడు ఉప్పొంగే వీళ్లు… ‘నో బాస్..’ అన్నామో అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ‘వై బాస్..’ అంటే చిందులు తొక్కుతారు. అయితే, సమర్థులైన ఉద్యోగులు ఇలాంటి బాస్‌ల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారు. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు తమలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్త పడతారు. పని మరింత పక్కాగా జరిగేలా చూస్తారు.
అన్నీ మాకే తెలుసు
ఈ తరహా బాస్‌లు చీటికిమాటికి ఉద్యోగులకు పనిలో సలహాలు ఇస్తుంటారు. ప్రతిదానినీ విమర్శిస్తుంటారు. అన్నీ తమకు మాత్రమే తెలుసు అనుకుంటారు. తాము ఆఫీస్ నిర్వహణలో విపరీతంగా తలమునకలైనందు వల్లే ఉద్యోగులకు పని ఇస్తున్నాం… తప్పిస్తే అన్నీ మేమే చేసుకుంటాం అనుకుంటారు. అయితే, ఉద్యోగులు పనిచేస్తుంటే బాస్‌లు వారిని దూరం నుంచి కనిపెడుతూ ఉండాలి. సలహాలు సూచనలు అవసరమైనప్పుడే ఉద్యోగుల పనిలో తలదూర్చాలి.
సెలవుల్లోనూ షెడ్యూళ్లు
కొంతమంది బాస్‌లు… ఉద్యోగులు నిరంతరం తమకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగులకు కంటిమీద కునుకనేది లేకుండా చేస్తారు. పండుగలు ఉన్నా కూడా ఏదో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసే బాసులూ కనిపిస్తారు. కానీ సెలవు దినాల్లో ఎవ్వరూ పనిచేయాలని కోరుకోరు కదా! కాబట్టి ఉద్యోగం జీవితం మధ్య సమతూకం ఉండేలా చూడాలి. కింది ఉద్యోగులను గౌరవించాలి. ఆరోగ్యంగా ఉండే ఉద్యోగులే ఆనందంగా ఉంటారు. మరింత ఉత్పాదకంగా పనిచేస్తారు.
సాధించేవాళ్లు
ఇలాంటి బాస్‌లు బిగ్గరగా అరుస్తారు. వస్తువులను మీదికి విసిరేస్తారు. ఆఫీస్‌ను తమ అదుపులో ఉంచుకుంటారు. ఉద్యోగుల్లో ఎవరికి పంపించారనే దానితో నిమిత్తం లేకుండా కంపెనీకి వచ్చిన ఈ మెయిళ్లన్నీ తామే స్వీకరిస్తారు. ఉద్యోగులకు పంపకుండానే వీటన్నిటికి బదులిస్తారు. తనకింది ఉద్యోగి తన స్థానంలో బాగా పనిచేస్తున్నారంటే ప్రమోషన్లు హోల్డ్ చేస్తారు. ఈ సమస్యకు పరిష్కారం… కంపెనీలో అందరినీ కలిపి ఉంచగలిగే, స్థిరంగా వ్యవహరించగలిగే వారినే అధికారులుగా నియమించుకోవాలి. అంతేతప్ప తిట్లు, బెదిరింపులతో పని ముందుకు సాగదనే విషయం గుర్తుంచుకోవాలి.
ఉచితాలు అనుచితంగా
కొంతమంది బాస్‌లు… కింది ఉద్యోగుల నుంచి ఉచితాలు పొందడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఉదాహరణకు క్యాంటీన్లో ఎదురుపడ్డప్పుడు కాఫీ తాగడం, టిఫిన్ చేయడం లాంటి సందర్భాల్లో చెల్లింపు ఉద్యోగుల నెత్తిమీద ఉంచుతారు. ఏదైనా పర్యటనకు వెళ్తుంటే అక్కడి ప్రత్యేకమైన వస్తువులు తీసుకురావాలని అడుగుతారు. డబ్బులు మాత్రం ఇవ్వరు. కాబట్టి బాస్‌లు ఎవరైనా సరే ఉద్యోగులకు కూడా కుటుంబాలు ఉంటాయని గ్రహించాలి. తమవారికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలవాల్సిన అవసరం వారికి ఉంటుందనే సంగతి గ్రహించాలి.
పట్టించుకోని బాస్‌లు
కొంతమంది బాస్‌లు కింది ఉద్యోగులు పంపించే మెసేజ్‌లను రోజుల తరబడి చదవకుండా అలానే ఉంచేస్తారు. ఒకవేళ మనంతట మనమే వాళ్లకు కనిపించినా.. మళ్లీ పిలుస్తాం అంటూ పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమెందుకు పనిచేస్తున్నామో కూడా తెలియని స్థితికి వచ్చేస్తాం. ఇలా కాకుండా అవసరమైనప్పుడు ఉద్యోగులకు ఫోన్ చేయడం, వీడియో కాల్స్, వ్యక్తిగతంగా సమావేశం కావడం, అప్పుడప్పుడు పర్యవేక్షించడం చేస్తుంటే ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు.
ఎంతకూ తెగనీయరు
కొన్ని కార్యాలయాల్లో బాస్‌లు కింది ఉద్యోగులు చేసే పనిని ఎంతకూ తెగనీయరు. దీంతో ఉద్యోగుల్లో అనారోగ్యకరమైన ఒత్తిడి నెలకొంటుంది. ఇలాంటప్పుడు ఉద్యోగుల్లో తమ సామర్థ్యం మీద నమ్మకం పోతుంది. ఇలాంటి బాస్‌లు ఉన్నచోట కంపెనీలు ఉద్యోగుల వైపునుంచి కూడా ఆలోచిస్తే పరిస్థితులు చక్కబడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- boss
- Office
- Office boss
- profession
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

