చివరి క్షణం
నలుపు కేవలం ఓ రంగు కాదు అది ఘనీభవించిన దుఃఖం తెలుపూ ఒట్టి రంగు కాదు విచ్చుకుని వికసించిన సంతోష పరిమళం
నలుపు కేవలం ఓ రంగు కాదు
అది ఘనీభవించిన దుఃఖం
తెలుపూ ఒట్టి రంగు కాదు
విచ్చుకుని వికసించిన సంతోష పరిమళం
నిజానికి
సప్త వర్ణాలల్లో ఏ ఒక్కటీ
ఏదో ఒక రంగు మాత్రమే కాదు
ఒక్కో రంగూ ఒక్కో భాష మాట్లాడుతుంది
ఒక్కో భావాన్ని ప్రకటిస్తుంది
మనం
బతికే కోట్లాది క్షణాల్లో
ఏ క్షణమూ ఒంటరిది కాదు
బతుకు ఒక్క రంగునూ ప్రతిబింబించదు
ప్రతి క్షణం గతంలో
తాను గడిపేసిన క్షణాన్ని వెంటేసుకొని
రానున్న క్షణంలోకి దారితీస్తుంది
దారీ తెన్నూ ఏ భవిష్యత్తూ లేనిది
ఒక్క చివరి క్షణమే
ఎప్పుడొస్తుందో తెలీని ఆ ఆఖరి క్షణం
తాను నడిచొచ్చిన క్షణాల్ని
చూస్తూ ఏడవకుండా
నవ్వుతూ కొవ్వొత్తిలా ఆరిపోతే
మనిషి బతుక్కి అంతకంటే ఆనందమేముంది
నలుపు తెలుపుల పరమార్థమేముంది
– వారాల ఆనంద్ 94405 01281
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

