Pawan Kalyan | ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన బాధ్యత కూటమిదే : పవన్‌కల్యాణ్
Pawan Kalyan | ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
అమరావతి : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తల్లిదండ్రులను వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్లి జీతభత్యాల కోసం పనిచేయడం కంటే ఇంటి వద్దే పనిచేస్తూ సరైన వేతనం పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
వైసీపీ నాయకులు( YCP Leaders ) గుండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని మండిపడ్డారు. ఏపీ గంజాయికి రాజధానిగా మారిందని పేర్కొన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని అన్నారు. కష్ట, నష్టాల్లో ప్రజల గొంతుకనవుతానని తెలిపారు.
సినిమాలో పనిచేస్తే ఐదేళ్లలో రెండు వందల కోట్లు సంపాదించి రూ. 70 కోట్లు పన్ను కట్టానని తెలిపారు. ప్రజల భవిష్యత్తే తమకు ముఖ్యమని తెలిపారు. గిరిజనుల గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తా్నని అన్నారు. కేసుల మాఫీ కోసమే ఇన్నాళ్లు వైఎస్ జగన్ (YS Jagan) మోదీ వెంట పడ్డారని, తాను మాత్రం సమస్యలను మోదీకి వివరించి పరిష్కరిస్తానన్న ధైర్యం తనకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కోసం రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

