Shruti Haasan | తండ్రీకూతుళ్ల ముచ్చట్లు.. నేను ఎప్పటికీ నాన్న కూచినే: శ్రుతిహాసన్
‘ప్రేమ ఎలా మొదలైనా.. దాని స్వభావం ఎలా ఉన్నా.. వదులుకోవడం మాత్రం కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో.. అంత భయంకరం ముగుస్తుంది. అదొక పోరాటం’ అంటున్నారు నటలోకనాయకుడు కమల్‌హాసన్.
Shruti Haasan | ‘ప్రేమ ఎలా మొదలైనా.. దాని స్వభావం ఎలా ఉన్నా.. వదులుకోవడం మాత్రం కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో.. అంత భయంకరం ముగుస్తుంది. అదొక పోరాటం’ అంటున్నారు నటలోకనాయకుడు కమల్‌హాసన్. ఆయన కుమార్తె శ్రుతిహాసన్ ‘ఇనిమేల్’ పేరుతో స్పెషల్ సాంగ్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ‘ప్రేమ వారసత్వం’ పేరుతో మరో పాటను శ్రుతి విడుదల చేయనున్నది. ఈ పాటకు కమల్‌హాసన్ సాహిత్యం అందించడం విశేషం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఈ సందర్భంగా ఈ తండ్రీకూతుళ్లు ఓ వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో కమల్, శ్రుతిల మాటలు ఇలా సాగాయి. ‘ సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు నచ్చకపోతే వదిలేశాను. ప్రేమను మాత్రం వదులుకోలేకపోయాను’ అని కమల్ అంటే.. ‘ మానాన్న నన్ను అందరిలా పెంచలేదు. ఆయన ఎమోషన్స్‌ని బయటకు కనిపించనివ్వరు. చిన్న పిల్లలు తండ్రులతో ఉండే రీల్స్ నాకాయన పంపినప్పుడు నన్ను మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. నేను ఎప్పటికీ నాన్న కూచినే’ అని శ్రుతి చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

