Pushpa-2 | సినిమాలో వాణిజ్య హంగులు ఎన్ని ఉన్నా, కథలో ఎమోషన్స్ లేకపోతే జనం చూడరు. అంటే సినిమా విజయానికి కావాల్సిన ప్రధాన బలం ఎమోషన్స్ అనమాట. కథలోని ఎమోషన్ కట్టిపడేస్తే ఇక ఆ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఉదాహరణకు ‘పుష్ప’నే తీసుకుందాం. ఇందులో కావల్సినన్ని వాణిజ్యహంగులున్నాయి. కానీ జనం కనెక్టయింది ఎమోషన్స్‌కే. పుష్పరాజ్కీ, పుష్పరాజ్ తల్లికీ మధ్య ఉండే ఎమోషన్స్, ‘పుష్ప’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, శ్రీవల్లికీ, పుష్పరాజ్కీ మధ్య నడిచే భావోద్వేగాలు.. ఇవి లేకుండా ‘పుష్ప’ను చూడగలమా? అసలు ‘పుష్ప’ అంత హిట్ కావడానికి కారణం ఆ ఉద్వేగాలే.
దర్శకుడు సుకుమార్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ‘పుష్ప 2’లో కూడా అద్భుతమైన భావోద్వేగాలు ఉండేలా కథ రాసుకున్నారు. ‘పుష్ప’లో తల్లీకొడుకుల సెంటిమెంట్, పుష్ప, శ్రీవల్లీల లవ్‌ట్రాక్ హైలైట్ అయితే.. ‘పుష్ప 2’లో ఫ్రెండ్షిప్ హైలైట్ కానుందట. పుష్పరాజ్, కేశవల స్నేహబంధంపై అద్భుతమైన ఎపిసోడ్స్ కుదిరాయని, వీరిద్దరి మధ్య సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తున్నది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని సమాచారం. మరి ఈ ఏడాది ఆగస్ట్ 15న రానున్న ‘పుష్ప2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.