Bethlehem Kudumba Unit | మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) చిత్రం డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో (JioHotstar) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అధికారికంగా ప్రకటించింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓనం పండుగా కానుకగా ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలై దాదాపు రూ 320 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూనే మరోవైపు ఓటీటీలోకి వస్తుండటం విశేషం. కేరళలోనే కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో నివిన్ పౌలీ ‘జస్టిన్’ అనే పెళ్లికాని యువకుడిగా నటించగా, ఆయన పక్కనే ఉన్న కాలనీకి ‘యాష్లీ’గా మమిత బైజు వచ్చాక జస్టిన్ జీవితంలో జరిగే మార్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పెద్దగా నాటకీయ మలుపులు లేకుండా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. యువత మనసులను హత్తుకునేలా భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుంది. ఇందులో సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, శ్రీంద, శ్యామ్ మోహన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు.