Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Diwali Firecracker Sales | దీపావళి పండుగ వేళ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో టపాసుల వ్యాపారం చుట్టూ వివాదం మొదలైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక లైసెన్సులు పొందిన వారు ఐదుగురే కాగా.. అనుమతులు లేకుండానే టపాసుల దుకాణాలు తెరిచేందుకు కొందరు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Diwali Firecracker Sales | కారేపల్లి, నవంబర్ 7: దీపావళి పండుగ వేళ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో టపాసుల వ్యాపారం చుట్టూ వివాదం మొదలైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక లైసెన్సులు పొందిన వారు ఐదుగురే కాగా.. అనుమతులు లేకుండానే టపాసుల దుకాణాలు తెరిచేందుకు కొందరు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిబంధనలు పాటించి వ్యాపారం చేసుకుంటున్న లైసెన్సుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో లైసెన్సులు పొందిన ఐదుగురు వ్యాపారులు టపాసుల దుకాణాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, సంబంధిత శాఖల అనుమతులతో విక్రయాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మండల కేంద్రంతో పాటు కొన్ని గ్రామాల్లోనూ ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా టపాసుల విక్రయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టపాసుల విక్రయాలు చేపట్టాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇందుకోసం లైసెన్సుదారులు అవసరమైన రుసుములు చెల్లించి, నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాల్లోనూ విక్రయాలు జరిగితే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తూ వ్యాపారం చేస్తుంటే.. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయాలు చేపట్టేందుకు సిద్ధమవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా విక్రయాలు జరిపేవారిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే లైసెన్సులు తీసుకున్న వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
దీపావళి పండుగ నేపథ్యంలో కారేపల్లి మండలంలో టపాసుల విక్రయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని లైసెన్సుదారులు కోరుతున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతులు పొందిన వారే విక్రయాలు చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టపాసుల విక్రయాల సమయంలో అగ్ని ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షూరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

