Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Salman Khan | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా ప్రచారం పొందుతున్న ‘రామాయణ పార్ట్ 1’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల ఎంపిక, నిర్మాణ వ్యయం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Salman Khan | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా ప్రచారం పొందుతున్న ‘రామాయణ పార్ట్ 1’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల ఎంపిక, నిర్మాణ వ్యయం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ‘రామాయణ’ సినిమా గురించి ప్రశ్నించగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
‘రామాయణం’ గురించి మాట్లాడేటప్పుడు కేవలం రూ.4 వేల కోట్ల బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే చర్చించడం సరైన విధానం కాదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. రాముడు, సీత, రావణాసురుడు వంటి గొప్ప పాత్రల ప్రత్యేకత, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు, వాల్మీకి రామాయణంలోని మూల కథను తెరపై ఎలా ఆవిష్కరించారనే విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నా కథలోని అసలు సారాంశమే ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆయన వ్యాఖ్యల సారాంశం.
ఇదే సందర్భంలో తన ‘మాతృభూమి’ సినిమాలోని కథానాయకుడి పాత్ర గురించి కూడా సల్మాన్ మాట్లాడారు. శ్రీరాముడు కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదని, ఉత్తమ కుమారుడిగా, మంచి భర్తగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. శ్రీరాముడిలో కనిపించే ఈ గొప్ప లక్షణాలు తన ‘మాతృభూమి’ చిత్రంలోని కథానాయకుడి పాత్రలోనూ కనిపిస్తాయని సల్మాన్ వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షూరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

